రాజ్ న్యూస్ మళ్లీ చేతులు మారేలా ఉంది. మొన్నటి సాధారణ ఎన్నికల వరకు కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ డైరెక్షన్‌లో నడిచిన ఈ ఛానెల్‌ను వారి లీజు గడువు ముగిసిన తర్వాత ... తిరిగి దాని ఒరిజినల్ ఓనర్స్ రాజ్ టెలివిజన్ నెట్‌వర్క్ వారే నడిపించారు. అయితే తాజాగా రాజ్‌న్యూస్‌ను బీజేపీకి చెందిన కొందరు నేతలు తమ హ్యాండోవర్‌లోకి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు రాజ్ న్యూస్ యాజమాన్యంతో దాదాపుగా డీల్ కూడా కుదిరినట్టుగా టాక్ వినిపిస్తోంది.
ఇటీవలే ఛానెల్‌లో పనిచేసే ముఖ్య ఉద్యోగులతో ఓ మీటింగ్ కూడా జరిపినట్టుగా తెలిసింది. ఛానెల్ గతంలోలానే నడుస్తుందని.. అయితే బీజేపీకి వార్తలకు మంచి కవరేజీ ఇవ్వాలని కొత్తగా వచ్చిన ఓనర్లు వారితో చెప్పినట్టుగా చెప్తున్నారు.
సాధారణంగా యాజమాన్యం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్నవారి ప్రాధాన్యత తగ్గించడమో లేక పొమ్మనలేక పొగబెట్టడమో జరుగుతుంది. దీంతో ఆ ఛానెల్‌లో పనిచేస్తున్న పాత ఉద్యోగులు కొంత టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి!
0 Comments